SBI's big notification this month for clerk posts
mictv telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో ఎస్బీఐ భారీ నోటిఫికేషన్!

July 14, 2022

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్ధులకు దేశంలోని ప్రముఖ బ్యాంకు ఎస్బీఐ తీపి కబురందించింది. ఈ ఏడాదికి సంబంధించి ఈ నెలాఖరులో భారీగా క్లర్కు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అంటే మిగిలిన రెండు వారాల్లో నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. దీని కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్ధులు బ్యాంకు వెబ్‌సైటును తరచూ చూస్తుండాలని సూచించింది. కనీస వయసు 21 కాగా, గరిష్ట వయసు 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. క్లర్క్ పోస్టులకు డిగ్రీ కనీస విద్యార్హతగా ఉంది. డిగ్రీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ రాసేవారు కూడా అర్హులు. మొదట ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. వీటి తర్వాత లాంగ్వేజ్ ఎఫీషియెన్సీ పరీక్ష మూడో దశలో ఉంటుంది. ఇదిలా ఉంటే బ్యాంకింగ్ ఉద్యోగాల నియామక సంస్థ ఐబీపీఎస్ ఇటీవల 6035 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబరులో, మెయిన్స్ పరీక్ష అక్టోబరులో ఉంటుంది. వయసు నిబంధనలు 20 నుంచి 28 వరకు ఉంది. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1 న ప్రారంభమవగా, చివరి తేదీ జులై 21 వరకు ఉంది.