దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

May 11, 2022

దేశద్రోహం చట్టం(IPC సెక్షన్ 124A) అమలుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయవద్దని, ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని పేర్కొంది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

IPC సెక్షన్ 124A రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం నేడు విచారించింది. సెక్షన్ 124 A కింద అభియోగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్‌లను ఉపసంహరించుకోవాలని తెలిపింది. ఇతర సెక్షన్లకు సంబంధించి ఈ తీర్పు నిందితులకు ఎటువంటి పక్షపాతం లేకుండా కొనసాగవచ్చని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిల్‌ కోసం న్యాయస్థానాలకు వెళ్లవచ్చని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.