వీవీప్యాట్ల లెక్కింపు.. ఈసీకీ సుప్రీంకోర్టు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

వీవీప్యాట్ల లెక్కింపు.. ఈసీకీ సుప్రీంకోర్టు నోటీసులు

March 15, 2019

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలు టాంపరింగ్ అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిని సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సినియర్‌ అధికారిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

SC seeks EC reply on Opposition’s plea for counting of VVPAT slips in Lok Sabha polls

ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా జరుగుతున్న ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా 50 శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 23 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌ యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రలు ఉన్నారు. ఈ 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్‌ అశోక్‌ లవాసా లను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికర స్పందన రాకపోవడంతో వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.