భారత్ బంద్‌లో హింస.. సుప్రీం తీర్పుపై దళితుల కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ బంద్‌లో హింస.. సుప్రీం తీర్పుపై దళితుల కన్నెర్ర

April 2, 2018

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989పై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు నిరసనగా దేశంలో దళితులు భగ్గమన్నారు. ఈ రోజు పలు దళిత సంఘాలు నిర్వహిస్తున్న బంద్ తీవ్ర ప్రభావం చూపుతోంది.  ముఖ్యంగా ఉత్తర భారతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఘర్షణల్లో నలుగురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఆస్తినష్టం కూడా జరిగింది. మోదీ ప్రభుత్వం ఎస్సీ ఎస్సీలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని నిరసనకారులు మండిపడుతున్నారు.


కాగా దళితులపై అత్యాచారాలువేధింపుల నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంఅవుతున్నందున.. తక్షణ అరెస్టులు చేయరాదంటూ ఇటీవల సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక దర్యాప్తు అనంతరమే నిందితులను అరెస్టు చేయాలని… ఒకవేళ ఉద్యోగులపై ఆరోపణలు వస్తే సంబంధిత అధికారి నుంచి ఉత్తర్వులు పొందాకే ప్రాసిక్యూట్‌ చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.