దళిత ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టిన అగ్రవర్ణాలు - MicTv.in - Telugu News
mictv telugu

దళిత ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టిన అగ్రవర్ణాలు

April 3, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఆదేశాలు దేశంలో చిచ్చుపెడుతున్నాయి. రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా హిందాన్ పట్టణంలో అగ్రకులస్తులు, వ్యాపారులు కలిసి ఒక దళిత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టారు. సోమవారం నాటి దళితుల భారత్ బంద్‌కు ప్రతీకారంగా ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. మంగళవారం వేలాదిమంది రోడ్లలపైకి వచ్చి నిరసన తెలిపారు. బంద్ వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బంద్ సందర్భంగా నిరసనకారులు ఓ బస్సులోని మహిళలను వేధించారని, అందుకే అగ్రవర్ణాల వ్యక్తులు, వ్యాపారులు కలసి బీజేపీ దళిత ఎమ్మెల్యే రాజ్‌కుమారి జాతవ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి భరోసీ లాల్ జాతవ్‌ల ఇళ్లను కాల్చారని పోలీసులు తెలిపారు. పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయోగించిన ఒక బాష్పవాయు గోళం స్కూల్లో పడ్డంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. 20మంది గాయపడ్డారు.