ఎస్సీ, ఎస్టీ తీర్పుపై సుప్రీం మంకుపట్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సీ, ఎస్టీ తీర్పుపై సుప్రీం మంకుపట్టు

April 3, 2018

ఒకపక్క దేశం ఆందోళనతో భగ్గుమంటున్నా, ప్రాణాలు పోతున్నా సుప్రీం కోర్టు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణతో తాము ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో తమకు తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆందోళన చేస్తున్నవారిపై విమర్శలు సంధించింది. ‘మేం ఈ చట్టానికి వ్యతిరేకం కాదు. దాన్ని బలహీనపర్చడం లేదు. అమాయకులను కాపాడుతున్నాం. వారికి శిక్షలు పడకూడదు..’ అని మంగళవారం పేర్కొంది.

నిరసనకారులు తీర్పును సరిగ్గా చదవలేదని,  స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. తాము చట్టాన్ని ఏ మాత్రం బలహీనపరచట్లేదని, అమాయకులను అరెస్ట్‌ల నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. తమ ఆదేశాలను రాజకీయం చెయొద్దని, ఆందోళన వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆక్షేపించింది.

ఎస్టీ, ఎస్టీపై అకృత్యాల నిరోధక చట్టం కింద నిందితులను విచారణ లేకుండా తక్షణ అరెస్ట్‌ చేయొద్దని, మధ్యంతర బెయిల్ తీసుకోవచ్చన సుప్రీంకోర్టు చ్చిన తీర్పుపై దళిత సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తీర్పును సమీక్షించాలని కేంద్రం పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. దీనిపై రాజకీయ పార్టీలు తమ స్పందన తెలపాలని ఆదేశించింది.