ఆలయ పూజారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఎస్సాఆర్ నగర్లో ఇది జరిగింది. కులం పేరుతో దూషించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతన్ని విచారిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. అర్చకుడి తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వెంగళరావునగర్ డివిజన్లోని శ్రీరామాంజనేయ దేవాలయానికి దర్శనం కోసం ఓ డాక్టర్ దర్శనం కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అర్చకుడు వెంకట రత్నం ఆమెకు తీర్థ, ప్రసాదాలు అందించేందుకు నిరాకరించాడని ఆరోపించింది. కులం పేరుతో తనను అవమానించాడని వాపోయింది. తోటి భక్తులు ఉండగానే కేకలు వేశాడని పేర్కొంది. మనస్తాపంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టారు.