ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం..వరుడి ఇల్లు ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం..వరుడి ఇల్లు ధ్వంసం

November 13, 2019

సమాజం అధివృద్ది పథంలో దూసుకుపోతున్న రోజుల్లో కూడా కులాంతర వివాహాలకు పెద్దలు అంగీకరించడంలేదు. దీంతో దేశంలో పరువు హత్యలు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. కొత్తగూడ మండలంలోని రామన్నగూడెంకు చెందిన ఎస్సీ కులానికి చెందిన యువకుడు, అదే గ్రామానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఈ నెల 5న పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

Sc st inter caste marriage...

ఊరికి వెళ్తే ప్రాణహాని ఉంటుందని గ్రహించి నర్సంపేటలోని స్నేహితుల వద్ద ఆశ్రయం తీసుకుంటున్నారు. ఈ విషయం మంగళవారం యువతి బంధువులకు తెలిసింది. దీంతో వెంటనే యువకుడి ఇంటికి వెళ్లారు. కానీ, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో తలుపులు పగులగొట్టుకుని లోనికి వెళ్లి వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. పెరట్లోని కొబ్బరి చెట్లను కూడా నరికేశారు. యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ తాహెర్‌బాబా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. పెళ్లి చేసుకున్న జంట ఊరికి వస్తే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.