టిక్ టాక్‌ను నిషేధించండి.. కంపెనీలకు కేంద్రం లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

టిక్ టాక్‌ను నిషేధించండి.. కంపెనీలకు కేంద్రం లేఖ

April 16, 2019

టిక్ టాక్ యాప్‌ను నిషేదించాలని గూగుల్, యాపిల్‌ కంపెనీలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. చైనాకు చెందిన ఈ  వీడియో యాప్‌ను తమిళనాడులో నిషేదించాలంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు వ్యతిరేకంగా టిక్‌టాక్ డెవలపర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తీర్పును ఏప్రిల్ 22 నాటికి వాయిదా వేసింది. అప్పటిదాకా మద్రాాస్ హైకోర్టు విధించిన నిషేదం కొనసాగుతుందని పేర్కొంది.

SC stay on ban, government asks Apple & Google to take down Tik Tok app

టిక్ టాక్ ద్వారా ‘పిల్లలు అపరిచితుల్ని నేరుగా కాంటాక్ట్ చేసే అవకాశముంది. ఇది చాలా ప్రమాదకరమైంది. పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉంది’ అని మద్రాస్ కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించి టిక్ టాక్ డెవలపర్లు.. ఇప్పటివరకు 60 లక్షల వీడియోలను తొలగించారు. అయినా కూడా టిక్ టాప్ యాప్ ను నిషేధించాలన్న డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నేతల దగ్గర్నుంచి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల వరకు అందరూ ఈ టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు.