గూగుల్, ఆపిల్ ఆప్ స్టోర్లలో టిక్ టాక్ మాయం.. కానీ - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్, ఆపిల్ ఆప్ స్టోర్లలో టిక్ టాక్ మాయం.. కానీ

April 17, 2019

చైనీస్ షార్ట్ వీడియో మొబైల్ అప్లికేషన్ టిక్‌ టాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టిక్ టాక్ ఆప్‌ను నిషేధించాలని వారం క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టిక్ టాక్ ఆప్‌ను తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్‌ సంస్థల్ని కోరడం జరిగింది.

దీంతో గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ ఆప్ స్టోర్ నుంచి టిక్ టాక్ ఆప్ మాయమైంది. ఇకపై ఎవరూ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఆప్ స్టోర్ నుంచి టిక్ టాక్ ఆప్ డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. ప్లేస్టోర్‌, ఆపిల్ ఆప్ స్టోర్‌లలో టిక్ టాక్ ఆప్ కోసం సెర్చ్ చేస్తే కనిపించట్లేదు. అయితే ఇప్పటికే ఈ ఆప్ ఉపయోగిస్తున్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు.వారికి ఆప్ ఓపెన్ అవుతోంది. వీడియోలు కనిపిస్తున్నాయి. కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారికి సాధ్యం కాదు.