Scam in teacher jobs.. Minister arrested by ED
mictv telugu

టీచర్ ఉద్యోగాలలో కుంభకోణం.. మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ

July 23, 2022

Scam in teacher jobs.. Minister arrested by ED

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో శుక్రవారం ఈడీ 20 కోట్ల నగదు పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో విచారణ వేగవంతం చేసిన ఈడీ.. ఈ స్కాంలో సంబంధం ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్ధా ఛటర్జీని శనివారం అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఆయనను 26 గంటల పాటు విచారించింది.

ఈయనే కాక, శుక్రవారం విద్యాశాఖ మంత్రి పరేష్, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. వీరితో పాటు మంత్రి పార్థా ఛటర్జీతో దగ్గరి సంబంధాలున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో తనిఖీలు చేపట్టగా, పైన పేర్కొన్న నగదు గుట్టలుగా దొరకడం ఈడీని విస్మయానికి గురి చేసింది. కాగా, ఈ వ్యవహారంపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ రాజకీయంగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదంతా బీజేపీ కుట్ర అని టీఎంసీ ఆరోపించగా, అసలు సినిమా ముందుందంటూ బీజేపీ నేత సువేందు అధికారి ఘాటుగా బదులిచ్చారు.