13 హారర్ సినిమాలు చూస్తే రూ. లక్ష నజరానా - MicTv.in - Telugu News
mictv telugu

13 హారర్ సినిమాలు చూస్తే రూ. లక్ష నజరానా

September 15, 2021

గుండె ధైర్యం ఉన్నవారికి హారర్ సినిమాలు బాగానే ఉంటాయి. ధైర్యం లేనివాళ్లు కూడా పక్కన ఇంకొకర్ని కూర్చోబెట్టుకునో, లేకపోతే పట్టపగలు లైట్లు వేసుకునే చూసే ధైర్యం చేస్తుంటారు. ఒక హారర్ సినిమా చూడాలంటేనే ఇంత తతంగం ఉంటుంది. మరి ఏకంగా 12 భయంకరమైన సినిమాలను చూడాల్సి వస్తే? ఏమీకాదు లక్ష రూపాయలు చేతికొస్తాయి.
తాము ఎంపిక 13 సినిమాలను 9 రోజుల్లో చూసేవారికి 1300 డాలర్లు(రూ. 95,800) బహుమతి ఇస్తామని అమెరికాకు చెందిన కంపెనీ ఒకటి ప్రకటించింది. దీని కోసం ‘‘హారర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’’ పేరుతో ఓ ఉద్యోగం కూడా సృష్టించింది. హారర్ చిత్రాల నాణ్యతను అంచనా వేయడానికి ఫైనాన్స్‌బజ్ కంపెనీ ఈ ఆఫర్ ఇస్తోంది.

‘భారీ బడ్జెట్ హారర్ సినిమాలు ఎక్కువ భయం పుట్టిస్తాయా? తక్కువ బడ్జెట్ హారర్ సినిమాలు ఎక్కువ భయంకరమా? అనే అంశాన్న పరిశీలించడానికి మూవీ ప్రియులు కావాలి’ అని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికన్లకే. అభ్యర్థులు అక్టోబర్ 9 నుంచి 18 మద్య 13 చిత్రాలను చూడాలి.
ఇదీ జాబితా..

సా (SAW), అమిటీవిల్లె హారర్, ఎ క్వయిట్ ప్లేస్, ఎ క్వయిట్ ప్లేస్ పార్ట్ 2, క్యాండీమ్యాన్, ఇన్‌సైడియస్, ది బ్లైర్ విచ్ ప్రాజెక్ట్, సినిస్టర్, గెట్ అవుట్, ది పర్జ్, హాలోవీన్ (2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నబెల్లె.