నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల ప్యాసింజర్ విమానం కుప్పకూలడంతో అందులోని 68 ప్రయాణికులతోపాటు నలుగురు మృతి చెందారు. అయితే, విమానం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. కుప్పకూలిన వెంటనే భారీ మంటలు ఎగిసిపడి.. అందులోని వారంతా తీవ్రగాయాల పాలై మృతి చెందారు. ప్రమాదానికి ముందు విమానంకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే వైరల్ అయింది. ఖాట్మండు వెళ్లే విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాలకే క్రాష్ అయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
🚨Trigger Warning.
The guy who’s shooting this is from Ghazipur India. Moments before the crash. pic.twitter.com/hgMJ187ele
— Gabbar (@GabbbarSingh) January 15, 2023
ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు కూడా మరణించిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు ప్రమాదానికి ముందు తన ఫ్లైట్ జర్నీని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే ప్యాసింజర్.. తాను పారాగ్లైడింగ్ కోసం ఖాట్మండు వెళుతున్నానన్న ఆనందంలో తన ఫేస్బుక్లో వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. అందులో అతను నవ్వుతూ కనిపించాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటుంది. ఆ తర్వాత నేలను ఢీకొని, మంటలు వ్యాపిస్తాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన సోను జైస్వాల్(29) లిక్కర్ వ్యాపారి. అనిల్ రాజ్‌భర్ (28), విశాల్ శర్మ (23), అభిషేక్ సింగ్ (23)లతో కలిసి జనవరి 13న నేపాల్ రాజధాని ఖాట్మాండ్కు వెళ్లాడు. ఈ నలుగురు అక్కడి పశుపతినాథ్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పారాగ్లైడింగ్ చేసేందుకు పొఖార బయలుదేరారు.కానీ దురదృష్ట వశాత్తూ ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమానం రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.