బాంబు పేలి.. 50 మంది పిల్లలకు అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

బాంబు పేలి.. 50 మంది పిల్లలకు అస్వస్థత

November 20, 2017

బిహార్ లోని కూచ్ బెహార్ జిల్లాలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారు చదువుకుంటున్న హల్దిబారీ పాఠశాల వద్ద ఒక బాంబు బయటపడింది. దీన్ని సరైన జాగ్రత్తలు లేకుండా పోలీసులు పేల్చి.. నిర్వీర్యం చేశారు. భీకర శబ్దం, దట్టమైన పొగ.. స్కూల్లోకి వెళ్లాయి.

దీంతో చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారు. 50 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో జల్పాయ్‌గురి ఆస్పత్రికి తరలించారు. పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొందరికి తీవ్రమైన చెవిపోటు వచ్చిందని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. పోలీసులు బాంబు దూరప్రాంతానికి తీసుకెళ్లి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు.