భారతదేశం నా మాతృభూమి.. అమ్మాయిలను వేధించము.. - MicTv.in - Telugu News
mictv telugu

భారతదేశం నా మాతృభూమి.. అమ్మాయిలను వేధించము..

December 13, 2019

School Boys.

మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. వీటికి అట్టుకట్ట వేయడానికి ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలను తీసుకొనివచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని బాలురందరితో బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించబోమని ప్రతిజ్ఞ చేయించాలని ప్రకటించారు. 

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తోటి విద్యార్థుల పట్ల మర్యాదకపూర్వంగా మెలిగే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని సీఎం సూచించారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఎఫ్‌ఐసీసీఐ మహిళా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహిళ పట్ల ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలని సూచించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తల్లులు, సోదరీమణులు పిల్లలను హెచ్చరించాలని ఆయన తెలిపారు.