20 మంది చిన్నారులు బలి.. లోయలో పడిన బస్సు - MicTv.in - Telugu News
mictv telugu

20 మంది చిన్నారులు బలి.. లోయలో పడిన బస్సు

April 9, 2018

హిమాచల్‌ ప్రదేశ్‌లోని  కాంగ్రా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నుర్పుర్‌ ప్రాంతంలో సోమవారం ఓ స్కూలు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. 20 మంది చిన్నారులు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. మృతులంతా పదేళ్లలోపు బాలలే అని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

గాయపడిన పిల్లలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. బస్సు సామర్థ్యం 42 మందికాగా, 60 మందిని డ్రైవర్ ఎందుకు ఎక్కించుకున్నాడో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.