నెల్లూరులో దారుణం..విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

నెల్లూరులో దారుణం..విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం

February 6, 2020

fvgb

నెల్లూరులో దారుణం జరిగింది. స్థానిక విద్యావిహార్ స్కూల్‌లో 8వ తరగతి చదివే 13 ఏళ్ళ విద్యార్థినిపై అదే.. స్కూల్‌లో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ అనే యువకుడు అత్యాచారం చేశాడు. దీనదయాల్ నగర్ ప్రాంతంలో సమాధుల వద్దకు తీసుకొచ్చి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. 

అత్యాచారం చేసే సమయంలో చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి, శివకు దేహశుద్ధి చేశారు. తరువాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడంతో ఆగ్రహించిన స్థానికులు స్కూల్ వ్యాన్‌ను తగలబెట్టారు.