ఈ ఎమ్మెల్యే తలలో ఉన్నది మెదడా? మన్నా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఎమ్మెల్యే తలలో ఉన్నది మెదడా? మన్నా?

February 9, 2018

మన రాజకీయ నాయకులకు రోజురోజుకు బుద్ధి మోకాళ్ల నుంచి అరికాళ్లలోకి జారిపోతోంది. వీధి రౌడీలు, జులాయిలు, అకతాయిలు అన్ని వారే అయిపోతున్నారు. విచక్షణ మరచిపోయి తమ పరువును తామే నడిబజార్లలో తీసేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒక  మహిళా బీజేపీ ఎమ్మెల్యే.. పరీక్షలు జరుగుతున్న స్కూల్లో బార్ డ్యాన్సర్లతో పచ్చి బూతు రికార్డింగ్ డ్యాన్సు లు వేయించారు.

 

తికమ్‌గఢ్‌లోని ప్రభుత్వ సెంకడరీ హైస్కూల్లో పరీక్షలు జరుతున్నాయి. 9వ, 11వ తరగతుల విద్యార్థులు కష్టపడి చదువుని వచ్చి మైదానంలో పరీక్షలకు కూర్చున్నారు. పెన్ను పేపర్లు పట్టుకుని ప్రశ్నలు చదువుకుంటూ జవాబులు రాస్తున్నారు. కానీ వారి పక్కనే ఎమ్మెల్యే అనితా యాదవ్ సారథ్యంలో నిర్వహిస్తున్న ‘సాంస్కృతిక’ కార్యక్రమం శబ్దాలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి.

పచ్చి బూతు పాటలు, హోరోత్తే మ్యూజిక్ నడుమ పరీక్షలు అలా సాగుతున్నాయి. లోకల్ బీజేపీ నేత, తన భర్త అయిన సునీల్ నాయక్ సంస్మరణార్థం  సదరు ఆడ ఎమ్మెల్యే ఈ మహత్తర పాటల ప్రోగ్రాం పెట్టారంట. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే కనీస వివేకం లేకుండా సాగించిన ఈ రచ్చపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.