school father stopped the student who came to school wearing Ayyappa mala
mictv telugu

అయ్యప్ప మాలతో స్కూలుకు.. ‘ఫాదర్’ వద్దని చెప్పడంతో..

October 27, 2022

అయ్యప్ప మాల ధరించి స్కూల్ కి వచ్చిన విద్యార్థిని.. స్కూల్ ఫాదర్ అడ్డుకున్నారు. స్కూల్ కి వచ్చేటప్పుడు యూనిఫాం , షూ తో రావాలని.. అలా అయితేనే క్లాస్ లోకి అనుమతిస్తామని చెప్పడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో ఈ రచ్చ జరిగింది.

విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న ఆంజనేయరెడ్డి బుధవారం అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చాడు. మాల తీసివేసి, బూట్లు ధరించి వస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని, లేదంటే వెళ్లిపోవాలని ఫాదర్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు. చేసేదేం లేక ఇంటికెళ్లిన ఆ బాలుడు.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. పాఠశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, అయ్యప్పస్వామి మాలధారులు, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు బడి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. మాల వేసుకుని బడికి రాకూడదని నిబంధనలు ఉన్నాయని సదరు ఫాదర్‌ చెప్పారు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వీహెచ్‌పీ సభ్యులు కోరారు. కాసేపటి తర్వాత విద్యార్థి మాల వేసుకుని పాఠశాలకు వచ్చేందుకు ఫాదర్‌ అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.