స్వచ్ఛ‌భారత్ అంటే ఇదీ.. రోజూ టాయిలెట్లు కడగుతున్న ప్రిన్సిపాల్ - MicTv.in - Telugu News
mictv telugu

స్వచ్ఛ‌భారత్ అంటే ఇదీ.. రోజూ టాయిలెట్లు కడగుతున్న ప్రిన్సిపాల్

November 19, 2019

స్వచ్ఛ భారత్ అంటే పరిహాసంగా మారిపోయింది. లేని చెత్తను తెచ్చి మరీ ఫొటోలకు ఫోజులు ఇస్తూ నిజంగానే పరిసరాలు శుభ్రం చేసేస్తున్నామన్నట్టుగా  మాత్రమే చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఓ స్కూలు ప్రిన్సిపాల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్లను తానే స్వయంగా శుభ్రం చేసి తర్వాత తన విధులు నిర్వహిస్తున్నారు. 

School Principal.

మధ్యప్రదేశ్‌లోని సహజ్‌పూర్ హైస్కూల్‌కు లక్ష్మీ పోత్రె ఏడాది క్రితం ప్రిన్సిాల్‌గా వచ్చారు. ఆమె వచ్చిన తొలి రోజుల్లో స్కూలు పరిసరాలు చాలా అధ్వాన్నంగా ఉండేవి. కనీసం టాయిలెట్లు కూడా శుభ్రంగా ఉండేవి కాదు. అది చూసిన ఆమె విద్యార్థులకు వ్యాధులు ప్రభలుతాయని భావించి తానే స్వయంగా చీపురు పట్టేశారు. స్కూలుకు  వచ్చిన వెంటనే టాయిలెట్లు, స్కూలు పరిసరాలు శుభ్రం చేసేవారు. ఆమెను చూసిన స్కూలు విద్యార్థులు, స్థానికులు, తోటి సిబ్బంది కూడా సాయం చేసే వారు. దీంతో అప్పటి నుంచి ఆ పాఠశాల వాతావరణమే మారిపోయింది. పూర్తి శుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదవుకుంటున్నారు. 

ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులతోనే పనులు చేయించడం చూస్తుంటాం. కానీ టీచర్ స్వయంగా టాయిలెట్లు శుభ్రం చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పిస్తూ..  గ్రామంలో పరిశుభ్రత పాటించాలని కూడా చెబుతున్నారు.