ఏపీ : పాఠశాలల ప్రారంభ తేదీ మార్పు.. కారణం ఇదీ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : పాఠశాలల ప్రారంభ తేదీ మార్పు.. కారణం ఇదీ

June 21, 2022

రాష్ట్రంలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యే తేదీని ప్రభుత్వం మార్చింది. ఇంతకు ముందు జులై 4న పున ప్రారంభమవుతాయని వెల్లడించగా, తాజాగా దానిని మార్చారు. ఒకరోజు ఆలస్యంతో జులై 5న పాఠశాలలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు గల కారణాన్ని కూడా వారు చూపిస్తున్నారు. జులై 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీలో పర్యటించనున్నారు. మంగళగిరి పరిధిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమంలో ప్రభుత్వం బిజీగా ఉండనుండడంతో స్కూలు ప్రారంభాన్ని వాయిదా వేశామని అధికారులు తెలియజేశారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే.