బుడ్డోడు మామూలోడు కాదు..ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

బుడ్డోడు మామూలోడు కాదు..ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు..!

November 25, 2019

ముద్దు ముద్దుగా కనిపించే చిన్న పిల్లలను చూసి పెద్ద వారు బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దుపెట్టుకున్నాడు. వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీకి ఓ కార్యక్రమంలో ఈ ఘటన ఎదురైంది. షేక్ హ్యాండ్ ఇస్తే ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఇలా తన ఆప్యాయతను వ్యక్తం చేశాడు. ఆ చిన్నోడి సరదా చూసిన వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

బుడ్డోడు మామూలోడు కాదు..ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు..!

Posted by Satyavathi Satya on Sunday, 24 November 2019

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఆమెకు స్కూలు విద్యార్థులు, పార్టీ శ్రేణులు అంతా స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు. స్కూలు విద్యార్థులు కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ సంబరపడిపోయారు. ఓ విద్యార్థి మాత్రం అందరిలా కాకుండా ఆమె బుగ్గ గిల్లి చేతో ముద్దు పెట్టుకున్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాతో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేపై ఆ బుడ్డో ప్రేమ చూసి నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు.