School Teacher Was Swept Away By The Scooty Due To The Raging River
mictv telugu

భారీ వర్షాలు.. వాగు ఉధృతికి స్కూటీతో కొట్టుపోయిన టీచర్‌

August 4, 2022

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రాగల రెండు రోజులు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జలాశయాలన్ని నీటితో నిండాయి. అయితే.. జనగామ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులు, కుంటలు, మత్తడి పోస్తున్నాయి. కొలనపాక-బచ్చన్నపేట మధ్యలో వాగు ఉధృతి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఓ స్కూల్‌ టీచర్‌ వాగు దాటేందుకు స్కూటీతో వెలుతుండగా వాగు మధ్యలోనే కొట్టుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై టీచర్ ని కాపాడారు. టీచర్‌ బచ్చన్నపేటకు స్కూటీపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

జనగామ – హుస్నాబాద్ ప్రధాన రహదారి, జనగామ మండలం వడ్లకొండ వద్ద ఉన్న కాజు వే పై వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. సర్పంచ్ ఆధ్వర్యంలో ముందస్తుగా రోప్ సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. పొంగిపొర్లుతున్న వాగుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కురుమవాడ, బాలాజీ నగర్, జ్యోతి నగర్, శ్రీనగర్ కాలనీలో వరద నీరు చేరి జలమయమయ్యాయి.