వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి సెలవులు పొడిగింపు లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన వుంటుందని మంత్రి సబిత తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65లక్షల మంది పిల్లలకు మంత్రి స్వాగతం పలికారు. యథావిధిగా బుక్స్,యూనిఫాం అందిస్తామని చెప్పారు.విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతాయని వెల్లడించారు.