సైన్స్ ఏకైక దేవుడు.. వర్మ కరోనా ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

సైన్స్ ఏకైక దేవుడు.. వర్మ కరోనా ట్వీట్

March 27, 2020

Science is the only God ..Ram G Varma Corona tweet

కరోనా వైరస్‌తో అటు జనాలు, ఇటు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు వేగవంతంగా ఆ మహమ్మారి నివారణకు చర్యలు చేపడుతున్నాయి. వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తొలుత నుంచి కరోనా వైరస్ మీద సెటైర్లు వేస్తున్నాడు. తాజాగా కరోనాపై మరో ట్వీట్ చేశాడు. భూ గ్రహానికి పట్టిన వైరస్‌ మనుషులని అన్నాడు. ‘భూమిపై ఉన్న జీవుల్లో మనుషులు మాత్రమే తమ సొంత ప్రాంతంలో ఉండకుండా ఎల్లప్పుడూ సంచారం చేస్తుంటారు. ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎల్లప్పుడూ ప్రయాణిస్తూ భూమికి సంబంధించిన సహజ వనరులను నాశనం చేస్తుంటాడు. ఇదే రకమైన పని చేసే మరో జీవి వైరస్‌ మాత్రమే’ అని పేర్కొన్నాడు. 

భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మానవులకు పట్టిన రోగం వైరస్‌ అని తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో ‘చర్చిలు, దేవాలయాలు, మసీదులు అన్నీ మూసివేయబడ్డాయి. భక్తులు గృహ నిర్బంధంలో ఉన్నారు, సైన్స్ వారిని రక్షించడానికి వేచి ఉంది.. అంటే సైన్స్ అనేది ఏకైక దేవుడు’ అని తెలిపాడు.