నేరగాళ్లకు ఇక చుక్కలే.. - MicTv.in - Telugu News
mictv telugu

నేరగాళ్లకు ఇక చుక్కలే..

September 5, 2017

శాస్త్ర, సాంకేతిక రంగంలో మరో గొప్ప ముందగుడు పడింది. ఒక మనిషి ముఖాన్ని అసలేమాత్రం చూడకుండానే, అతని ముఖం ఎలా ఉంటుందో రూపొందించారు శాస్త్రవేత్తలు. దీని కోసం అతని ఫొటోలు, వీడియోలు, ఎక్స్ రే వంటి వేటినీ చూడలేదు. కేవలం అతని డీఎన్ఏ నమూనా(జన్యువుల కోడ్) మాత్రం తీసుకున్నారు. దాదాపు 80 శాతం కచ్చితత్వంలో ముఖాన్ని రూపొందించారు. నేరగాళ్లను పట్టుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. నేరం జరగిన స్థలాల్లో దొరికే నేరస్తుల వెంట్రుకలు, లాలాజం, రక్తం వంటి నమూనాల ఆధరంగా వాటి ముఖాలను రూపొందించి, అరెస్ట్ చేయడానికి మార్గం సుగమం అయింది.

బ్రిటన్ కు చెందిన 100 జినోమ్స్ ప్రాజెక్టు కింద శాస్త్రేవేత్తలు ఈ అధ్యయనం చేశారు. దాదాపు వెయ్యిమందికి చెందిన రక్తం, వెంట్రుకలు తదితర నమూనాలను సేకరించి డీఎన్ఏ డేటాబేస్ తయూరు చేసుకున్నారు. తర్వాత ఒక సంక్లిష్టమైన అల్గరిథమ్ ను రూపొందించారు డీఎన్ఏల విశ్లేషణ కోసం. దాని సాయంతో డీఎన్ఏ నమూనాకు సంబంధించిన మనిషి ముఖాన్ని కంప్యూటర్ సాయంతో రూపొందించారు. ఫలితాలను విశ్లేషించగా..  శాస్త్రవేత్తలు రూపొందించిన ముఖం.. అసలు వ్యక్తి ముఖాన్నే పోలి ఉంది. కేవలం పోలికలే కాకుండా రంగు, వెంట్రుక తీరుతెన్నులు కూడా సరిపోయాయి. అయితే ఇలాంటి ప్రయోగాల వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశముందన్న భయాందోళనలూ వ్యక్తం అవుతున్నాయి.