Scientists discover 30 never before seen deep-sea species in Pacific Ocean
mictv telugu

పసిఫిక్ సముద్రపు అడుగు భాగాన విచిత్ర జీవులు

August 4, 2022

శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రం యొక్క అడుగుభాగాన జీవుల DNA సేకరిస్తున్నప్పుడు దాదాపు 40 కొత్త సముద్ర జాతులను కనుగొన్నారు. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు అమెరికా తీరంలోని హవాయి నుంచి మెక్సికో మధ్య సగటున ఐదు కిలోమీటర్ల (16,400 అడుగుల) లోతున సముద్రపు నేలపై అక్కడి జంతువుల నమూనాల DNA ను సేకరించారు. రోబోటిక్ సముద్ర వాహనాన్ని ఉపయోగించి చేసిన ఈ యాత్రలో సముద్రపు అడుగుభాగంలో 39 కొత్త జాతుల ఆవిష్కరణకు దారితీసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఆ కొత్త జాతిలో ఓ వైపు తొక్క తీసి పక్కన పెట్టిన అరటి పండులా ఉన్న జంతువు విచిత్రంగా ఉంది. సీ కుకుంబర్ జాతికి చెందిన ఈ జంతువుకు శాస్త్రవేత్తలు ‘గమ్మీ స్వ్కిరెల్’ అని పేరు పెట్టారు. సన్నగా పొడుగ్గా పసుపు పచ్చ రంగులో ఉన్న ఈ జీవికి తోక ఆకారంలో పెద్ద టెంటకిల్ ఉంది. శరీరం దిగువన పెద్ద సంఖ్యలో కాళ్ల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఫొటోలో చూడటానికి చిన్నగా కనిపిస్తోందిగానీ.. ఈ గమ్మీ స్వ్కిరల్ రెండు అడుగుల పొడవు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సముద్ర స్పాంజ్ ల జాతికి చెందిన మరో జీవిని కూడా శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు. ఈ జీవి తెలుపు రంగులో అచ్చం తులిప్ పుష్పం తరహాలో ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హ్యలోనెమా’ అని పేరు పెట్టారు. భూమి నుంచి ఓ కాడ పైకి ఎదిగి దానికి తులిప్ పుష్పం ఏర్పడినట్టే.. ఈ జీవి పొడవాటి కాడ వంటి నిర్మాణంతో సముద్రం అడుగున నేలకు అనుసంధానమై.. ప్రధాన భాగం నీటి మధ్యలో వేలాడుతున్నట్టుగా ఉంది.