Scientists discover a kind of SUPERWORM that can munch on polyester
mictv telugu

గుడ్ న్యూస్.. ప్లాస్టిక్‌ను తినే పురుగులను గుర్తించారు

June 15, 2022

Scientists discover a kind of SUPERWORM that can munch on polyester

ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హానికలుగుతుందని.. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ కారణంగా భూమికి హాని కలుగుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మానవాళికి అతిపెద్ద సమస్యగా మారిన ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఓ చిన్న పురుగు సమర్ధవంతంగా ఎదుర్కోంటుందని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ప్లాస్టిక్ తినడం ద్వారా ఆ పురుగు జీవించగలదని, దానిని ఒక సూపర్ వార్మ్ గా పేర్కొన్నారు. లార్వా జాతికి చెందిన పురుగు పేరు జోఫోబాస్ మోరియో. ఈ పురుగు పాలీస్టైరిన్ అనే ప్రత్యేకమైన ప్లాస్టిక్‌ను సులభంగా జీర్ణ చేసుకుంటుందని పరిశోధకులు అంటున్నారు. ఈ పురుగు పేగులో ఉండే బ్యాక్టీరియా ప్లాస్టిక్ ను తేలికగా అరిగించగలదట. ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి ప్లాస్టిక్‌ను జీర్ణం చేసుకునేది బ్యాక్టీరియా. దీని సహాయంతో నాణ్యమైన బయోప్లాస్టిక్‌లను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మెక్సికో, థాయిలాండ్ ప్రజలు ఈ పురుగును ఆహారంగా తింటారు. పక్షులు, సరీసృపాలు తినడానికి ఈ పురుగును పెంచుతారు. దీని పరిమాణం 2 అంగుళాలు (5 సెం.మీ.) వరకు ఉంటుంది. ఈ పురుగుపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వీటిని మూడు గ్రూపులుగా విభజించారు. వారికి మూడు వారాల పాటు ప్రత్యేక ప్లాస్టిక్ డైట్‌లు పెట్టారు. ఈ సమయంలో పాలీస్టైరిన్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన థర్మాకోల్ (స్టైరోఫోమ్) తినే కీటకాల బరువు పెరుగుతూ కనిపించింది. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌కు చెందిన బృందం ఈ పరిశోధన చేసింది. అయితే పాలీస్టైరిన్, స్టైరిన్ ముక్కలను తినడం ద్వారా ఈ పురుగు చనిపోతుందని తెలిసింది. ఈ రెండింటినీ ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లు, కారు విడిభాగాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.