ఇమ్రాన్ ఖాన్‌ను ఆహ్వానించనున్న భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్ ఖాన్‌ను ఆహ్వానించనున్న భారత్

January 16, 2020

vgfc

ఈ ఏడాది ఢిల్లీలో జరగనున్న భారత్‌ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సదస్సుకు భారత్, పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ఆహ్వానించనుంది. ఎస్‌సీఓలో పాకిస్తాన్‌ సభ్యదేశంగా ఉంది. ఈ సదస్సుకు ఎనిమిది సభ్య దేశాలు, నాలుగు అబ్జర్వర్‌ స్టేట్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులను భారత్‌ ఆహ్వానించనుంది. 

గురువారం కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లోని సభ్యదేశం ద్వారా పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు హేయమైనవి. పాక్‌ తన స్వలాభం కోసం ఐరాస వేదికను దుర్వినియోగ పరుస్తోంది. ద్వైపాక్షిక అంశాల ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలను ఐరాస వేదిక మీదకు తీసుకొస్తుంది. అందుకు యూఎన్‌ఎస్‌సీ సభ్యులు అభ్యంతరం తెలపడం హర్షణీయం. నిరాధార ఆరోపణలు చేసిన పాక్‌కు ఐరాసలో భారత్‌ గట్టి సమాధానం ఇచ్చింది. భారత్‌-పాక్‌కు సంబంధించిన ఎటువంటి అంశాలైన ద్వైపాక్షిక చర్చల ద్వారా జరగాల్సిందేననే విషయం మరోసారి కుండబద్ధలయ్యేలా ఆ దేశానికి చెప్పాం. భవిష్యత్‌లో ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలి’ అని అన్నారు. కాగా, గతేడాది జూన్‌లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్‌కి ప్రధాని మోదీ, ఇమ్రాన్ ఖాన్ హాజరైన విషయం తెలిసిందే.