Scoot chief Campbell Wilson to be CEO & MD of Air India
mictv telugu

ఎయిరిండియా పగ్గాలు విదేశీయుడికి అప్పగింత

May 12, 2022

ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాప్ బెల్ విల్సన్(50) ను నియమిస్తూ టాటా సన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమ్మివేసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోగా… ఈ ఏడాది జనవరి నుంచి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుంది.

న్యూజిలాండ్‌కు చెందిన క్యాంప్ బెల్ విల్సన్ కు విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది. క్యాంప్ బెల్ విల్సన్ 1996లో న్యూజిలాండ్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్ మేనేజింగ్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి సింగపూర్ ఎయిర్ లైన్స్ అనుబంధ సంస్థ అయిన స్కూట్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. టాటాల అధీనంలోని ఎయిరిండియా సంస్థకు తనను ఎండీ, సీఈవోగా నియమించడం పట్ల క్యాంప్ బెల్ విల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.