స్కూటీ ఒక్కరికి సరిపోతుంది. భారీ కాయులకైతే కిర్రుమని చచ్చి ఊరుకుంటుంది. లేడీస్‌కి, పిల్లలకి, సన్నగా వుండే మగవాళ్లకి ఆ బండ్లు సూట్ అవుతాయి. కానీ గాడిద బరువులు అస్సలు సూట్ కావు. అలాంటి బక్కాతి బక్క, అల్పవాహనంపై ఒక పెద్దకారులో పట్టే సామాన్లనే ఎక్కించ రయ్యిమన్నాడో డెలివరీ బాయ్. అది కూడా సీటుమీద కూర్చోకుండా సీటు వెనకాల జానండెత అంచుపై కూర్చుని రయ్యిమని నడిపించేశాడు. ఒక మెస్తరు కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, పప్పు ఉప్పు సర్వసమస్తాన్ని బండిపై అలవోకగా తీసుకెళ్లిపోయాడు. మధ్యలో ఎవరైనా అడ్డమొచ్చినా, బండి నిలపాల్సిన వచ్చినా ఏం చేస్తాడన్న డౌట్ మనకొస్తుందిగాని అతనికి రానేరాదు. గాడిద బరువులను అంత నైపుణ్యంతో తీసుకెళ్తున్న ఆ బైకర్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Sachin Tendulkar carrying Indian ODI team in the 90s pic.twitter.com/AU7RqwyHjh
— Rajabets India🇮🇳👑 (@smileandraja) June 21, 2022