ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు పక్కన ఓ తోడు ఉండాలంటారు నిపుణులు. లేదంటే ఆ బలహీన క్షణాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని చెబుతారు. అలాంటి సమయాల్లో గట్టి అరిస్తే టెన్షన్ దూరం అవుతుందనే చిట్కాను నిపుణులు చెప్పారు. దానిని ఇప్పుడు ఐస్‌ల్యాండ్ ప్రభుత్వం అవలంభిస్తూ.. బంపర్ ఆఫర్ కింద ప్రకటించింది. ప్రజలు ఎవరైనా సరే పెద్దగా అరిచి కేకలు పెట్టి ఆ ఆడియోలు తమకు పంపితే.. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పీకర్లలో వినిపిస్తామని వెల్లడించింది.
దీనికోసం స్పెషల్‌గా ఏడు స్పీకర్లను అమర్చింది. ‘లెట్ ఇట్ అవుట్’ క్యాంపెయిన్ పేరిట దీనిని నడుపుతోంది. దీనికోసం ఐస్‌ల్యాండ్ దేశ టూరిస్ట్ బోర్డు ప్రత్యేకంగా ప్రకటనలు చేసింది. ‘ఒత్తిడిలో ఉన్నప్పుడు గట్టిగా అరిచి కేకలేస్తే మనకు ఉపశమనం కలుగుతుంది. దాంతో ప్రశాంతంగా ముందడుగు వేయగలుగుతాం’ అని క్యాంపెయిన్‌కు చెందిన వెబ్సైటులో అధికారులు స్పష్టంచేశారు.