స్క్రీన్ రైటర్ గా కంగనా ! - MicTv.in - Telugu News
mictv telugu

స్క్రీన్ రైటర్ గా కంగనా !

August 10, 2017

కంగనా రనౌత్ తాజా సినిమా ‘ సిమ్రన్ ’ ట్రైలర్ రిలీజ్ అయి మంచి వ్యూస్ ని సంపాదించుకున్నది. ఇందులో కంగానా లుక్స్ చాలా క్యూట్ గా వున్నాయని అంటున్నారు. క్వీన్ తర్వాత కంగనా చాలా ఇష్టపడి చేసిన క్యారెక్టర్ సిమ్రన్ అని అనడం ఈ చిత్రం పై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా ద్వారా కంగనా తనలోని మరో కోణాన్ని చూపించబోతోంది. అదేంటంటే ఈ సినిమాకు స్ర్కీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా రచయిత్రిగా కూడా తన సత్తా చాటనుంది మరి. ఇది ఖచ్చితంగా కంగనాలోని డిఫరెంట్ యాంగిలే. తప్పకుండా ఈ సినిమా కూడా తనకు జాతీయ నటి అవార్డును మరోమారు తీసుకొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. హన్సల్ మెహెతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో వుండగానే కొన్ని వివాదాలను మూట గట్టుకున్నది.

అయితే ఈ సినిమాకు కథా, స్ర్కీన్ ప్లే, మాటల రచయితగా అపూర్వ అస్రానీ వున్నాడు. అధికారికంగా ఈ సినిమాకు రైటర్ గా అపూర్వ అస్రానీ పేరు మీడియా ముఖంగా పబ్లిసిటీ కూడా అయింది. అయితే సడన్ గా ఏమైందో కంగనా ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా కంగనా పేరు తెర మీద వేస్తున్నారు. అపూర్వ అస్రానీ పేరును కేవలం కథ వరకే పరిమితం చేసేసారు. అస్రానీ ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించాడు. అయితే కంగనా ఎంట్రీతో ఈ కథలో చాలా మార్పులు వచ్చాయి, అలాగే తన ప్రమేయంతో డైలాగ్ లు రాయడంలో కొత్తదనం కనిపించిందని డైరెక్టర్ పేర్కొనడం యాదృచ్చికం. ఇలా రకరకాల వివాదాలతో 15 నవంబర్ 2017 న రిలీజ్ కు సిద్ధమౌతున్న ఈ సినిమా ఎక్కువగా కంగనా రనౌత్ కే కలిసొస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంటనే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘ మణి కర్ణిక ’ కూడా తన కెరియర్లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది కంగనా.

screen writer kangana ranouth, simran trailer, hansal mehta, apoorva asrani, storry