సముద్ర గర్భంలో భారీ అనకొండ.. వణికిపోయిన స్కూబా డైవర్లు
సాధారణంగా భారీ అనకొండలను మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో అతి భారీ అనకొండను కనుగొన్నారు. సుమారు 23 అడుగుల పొడవు 90 కిలోల బరువుండే అనకొండ నుంచి వారు తెలివిగా తృటిలో తప్పించుకున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోని ఇప్పటివరకు 46 లక్షల మంది చూశారు. వీడియో ప్రకారం.. స్కూబా డైవర్లు కెమెరా పట్టుకొని సముద్ర గర్భం వరకు వెళ్లారు. అక్కడ వారికి హఠాత్తుగా ఆకుపచ్చ రంగులో ఉన్న ఆనకొండ కనిపించింది. దాంతో వారు గజగజ వణుకుతూ అలాగే కదలకుండా నిల్చుందిపోయారు. అది వారి వైపుగా కెమెరా వరకు వచ్చి నాలుకతో వాసన చూసింది. (ఆహారం కోసం ఆనకొండలు ఇలాగే ప్రవర్తిస్తాయి) తర్వాత ఆనకొండ వారి నుంచి వెళ్లిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే ఆనకొండలు తమంత తాముగా ఎవరిపై దాడి చేయవు. ఈ విషయాన్ని గ్రహించిన డైవర్లు అది ఉన్నంత సేపు భయపడకుండా ఉండడంతో అనకొండ వచ్చిన దారిన వెళ్లిపోయింది. అయితే సముద్ర గర్భంలో ఇంత పెద్ద అనకొండ ఉండడం తమకు ఆశ్చర్యానికి గురి చేసిందని స్కూబా డైవర్లలో ఒకరు వెల్లడించారు.