స్కర్ట్‌ వేసుకున్న యువతి అరెస్టు..! - MicTv.in - Telugu News
mictv telugu

స్కర్ట్‌ వేసుకున్న యువతి అరెస్టు..!

July 19, 2017

అన్ని దేశాల్లో ఉన్నట్టే ఆ దేశాల్లో ఉంటామంటే నడవదు. స్కర్ట్ లు వేసుకుని రోడ్లపై వేషాలు వేస్తామంటే అస్సలు కుదరదు. ఆ దేశ నియామావళి ప్రకారం గీసిన గీత దాటితే చర్యలు తప్పవు.. దుబాయ్ లో స్కర్ట్ వేసుకుని తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేశారు.

సౌదీ అరేబియాలో మహిళలకు కట్టుబాట్లు ఎక్కువ. వేసుకుని డ్రెస్సుల నుంచి చేసే పనుల వరకు అన్నింటికీ రూల్స్ ఇంటాయి. అలాంటి దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఓ యువతి స్కర్ట్‌ ధరించి కన్పించింది. నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఈ యువతి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ లేడీని సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. సౌదీలో మహిళల దుస్తులపై కొన్ని ఆంక్షలు ఉంటాయి. వారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. అంతేగాక, అక్కడ మహిళలు డ్రైవింగ్‌ చేయడం నిషేధం. ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే తప్పదు యాక్షన్.

https://www.youtube.com/watch?v=KLRUeik5hC8