ఏపీలో భయం..2 కి.మీ. ముందుకొచ్చిన సముద్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో భయం..2 కి.మీ. ముందుకొచ్చిన సముద్రం

May 25, 2020

andhra pradesh

ఇటీవల పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్‌ తుపాను సముద్ర తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. రెండో అతిపెద్ద సూపర్ సైక్లోన్‌గా మారడంతో పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. అయితే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం చింతలమోరిలో ఎంఫాన్ తీరం దాటి రోజులు గడిచిన తర్వాత మరోసారి సముద్రం 2 కి.మీ. మేర ముందుకు వచ్చింది. దీంతో తీర ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

సాధారణంగా 50 మీటర్లు ముందుకు వస్తేనే ప్రమాదమని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. అయితే, ఏకంగా రెండు కిలోమీటర్ల మేర సముద్రం చొచ్చుకురావడంతో అక్కడి ప్రజల్లో భయం పెరిగింది. సునామీ సమయాల్లోనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని, సునామీ హెచ్చరికలు లేకుండానే ఇలా జరగడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సముద్రం ముందుకు రావడంతో అక్కడి పంటపొలాలన్నీ ఉప్పునీటితో నిండిపోయాయి. సారవంతమైన తమ నేలలు సముద్రం నీటి కారణంగా పాడైపోయాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.