సముద్ర విమానంలో ప్రధాని.. దేశంలోనే తొలిసారి.. - MicTv.in - Telugu News
mictv telugu

సముద్ర విమానంలో ప్రధాని.. దేశంలోనే తొలిసారి..

December 12, 2017

దేశంలో మంగళవారం అరుదైన రికార్డు నమోదైంది. తొలి సముద్ర విమానం దూసుకుపోయింది. ప్రధాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందులో ప్రయాణించడం మరో విశేషం. మంగళవారం పొద్దున అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది నుంచి ధరోయ్‌కి మోదీ   సముద్ర విమానంలో వెళ్లారు. ధరోయ్‌ డ్యామ్‌ చేరుకున్న తర్వాత.. మళ్లీ రోడ్డెక్కి.. అంబాజీ చేరుకున్నారు. అక్కడి అంబా మాతను దర్శించుకున్నారు. గుజరాత్ ఎన్నికల సభకు మోదీకి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆయన జనాన్ని ఆకర్షించడానికి  ఈ  సముద్ర విమాన ఎత్తు.

మరోవైపు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇప్పటికే 89 స్థానాలకు తొలి విడత పోలింగ్‌ పూర్తవగా మిగిలిన స్థానాలకు డిసెంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 18న పలితాలు వెల్లడిస్తారు. రెండో దశ ఎన్నికల ప్రచారానికి నేడు చివరిరోజు కావడంతో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. షెడ్యూల్‌ ప్రకారం.. నేడు ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అది రద్దవడంతో ఆయన అంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ విమానం సాకుతో మోదీ.. తన ప్రత్యర్థి రాహుల్‌ను దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం కష్టమని, అందుకే జలమార్గాలపై దృష్టిపెట్టామన్నారు.