‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’తో వరల్డ్ రికార్డు నెలకొల్పిన గుజరాత్ మరో అరుదైన ఘనత నమోదు చేసింది. దేశంలో తొలిసారిగా సీ ప్లేన్ సర్వీసును ప్రారంభించింది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రయాణించారు. ‘ఐక్యతా’ విగ్రహం మీదుగా చక్కర్లు కొట్టే ఈ సీ ప్లేన్ సబర్మతి నదిలో విహరిస్తుంది.
నర్మదా జిల్లాలోని కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ విగ్రహం వద్ద సీప్లేన్ సర్వీసులు కూడా ప్రారంభం కావడంతో గుజరాతీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీ ప్లేన్ ప్రత్యేకతలు
గాలిలో విమానంలా, నీటిలో పడవలా దూసుకెళ్తుంది. నీటిలోంచి నింగిలోకి టేకాఫ్ తీసుకుంటుంది. మాల్దీవుల నుంచి తీసుకొన్న ఈ విమానాన్ని స్పైస్ జెట్ సంస్థ నిర్వహిస్తోంది. ఇది గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 3 గంటలు ప్రయాణిస్తుంది. ఒక మనిషికి టికెట్ రూ.4,800. ఇందులో ఒకేసారి 19 మంది ప్రయాణించే వీలుంది.
PM Shri @narendramodi inaugurates water aerodrome and sea plane service in Kevadia, Gujarat. https://t.co/hss2STi3Zk
— BJP (@BJP4India) October 31, 2020