Sean Penn presents Ukrainian President Volodymyr Zelenskyy with his Oscar
mictv telugu

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఆస్కార్ అవార్డు !

November 9, 2022

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నెలలు గడిచిపోయాయి. ఎప్పుడు..ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు, ప్రజలు చనిపోయారు. రష్యా తన బలాన్నంతా ఉక్రెయిన్‌పై ఉపయోగించి ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే ఉక్రెయిన్ వెనక్కుతగ్గకుండా పోరాడుతోంది. ఉక్రెయిన్ పోరాట పటిమను చూసిన ఇతరు దేశాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రక్షణ కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన షాన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి తన అస్కార్ అవార్డును అందించాడు. యుద్ధంలో రష్యాతో పోరాడుతున్న తీరుకు గాను ఈ ఆవార్డును జెలెన్ స్కీకి ప్రదానం చేసాడు. ఈ విషయాన్ని స్వయంగా జెలెన్ స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసాడు. అదే సమయంలో జెలెన్ స్కీ తమ దేశ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్‌’ పురస్కారాన్ని పెన్‌కు ప్రదానం చేసారు.

నిజానికి ఉక్రెయిన్ ఉద్రిక్తత పరిస్థితులకు ముందు ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు సంబంధించి డాక్యుమెంటరీ తీసేందుకు సీన్ పెన్ ప్రయత్నించాడు. అందుకు ఆదేశంలో షూటింగ్ కూడా చేసాడు. అయితే అప్పుడు యుద్ధం మొదలు కావడంతో అక్కడి నుంచి వెనక్కు వచ్చేసాడు.

మార్చిలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత హాలీవుడ్ నటుడు తన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సీన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో తన సమావేశాలపై మాట్లాడారు. దాడికి ముందు, తర్వాత ఆయనను కలిశానని చెప్పారు. ధైర్యం, గౌరవం, ప్రేమతో జెలెన్ స్కీ ఉక్రెయిన్ ను ఏకం చేసి అందరినీ ఆకట్టుకున్నారని కొనియాడారు. ఇలాంటి విషయం ఆధునిక ప్రపంచంలో ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డాడు