చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

May 17, 2022

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిందంబరం తనయుడి ఇంట్లో, ఆఫీసులో మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు చేపట్టింది. పంజాబ్‌లోని ఓ ప్రాజెక్టులో పని చేసేందుకు వీలుగా చైనా జాతీయులకు కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించాడని, రూ.50 లక్షలు లంచం తీసుకున్నాడని ఆయనపై ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు అప్రమత్తమైయ్యారు. ఈ క్రమంలో కార్తీ చిదంబరంకు సంబంధించి ముంబై, చెన్నై, ఒడిశా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న వసతుల్లో తనిఖీలు చేపట్టారు.

సీబీఐ దాడులపై కార్తీ చిదంబరం ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ”ఇంకా ఎన్నిసార్లు సోదాలు చేస్తారు? ఇప్పటికీ ఎన్నిసార్లు ఇలా జరిగింది? తప్పనిసరిగా రికార్డు ఉండాలి’ అంటూ పేర్కొన్నాడు. ఇందులో సీబీఐ పేరును మాత్రం ఆయన ప్రస్తావించలేదు. 2010-2014 మధ్య విదేశాల నుంచి కార్తీ చిదంబరం ఖాతాలకు నగదు బదిలీలు జరిగినట్టు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. గతంలో ప్రాథమిక విచారణ మాత్రమే చేయగా, ఇప్పుడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సోదాలు నిర్వహించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.