Searches in chit fund companies including margadarshi in andhra pradesh
mictv telugu

మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో సోదాలు

November 15, 2022

Searches in chit fund companies including margadarshi in andhra pradesh

ఏపీ వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి సహా పలు చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలలో మంగళవారం అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును చిట్ ఫండేతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్టు ప్రధానంగా గుర్తించారు.

చట్టాలను ఉల్లంఘించి ఆ డబ్బును వడ్డీలకు తిప్పడం, ఫిక్స్ డిపాజిట్ చేయడం వంటి వాటిని కనుగొన్నారు. అలాగే రికార్డులు, ఖాతాలు సరిగా నిర్వహించడం లేదని.. కొన్ని కంపెనీలు అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. మరి వీటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా? లేదా జరిమానా విధించి క్రమబద్దీకరిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంపై అధికారులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.