Second Audio Leaked,FarmHouse case, Audio,Conversion,Ramachandrabharathi, nandu, simhayajulu
mictv telugu

రోహిత్ రాజీనామా చేస్తే..నెలరోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది..!

October 28, 2022

Second Audio Leaked,FarmHouse case, Audio,Conversion,Ramachandrabharathi, nandu, simhayajulu

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ పై రెండో ఆడియో బయటకొచ్చింది.ఈ ఆడియో 27 నిమిషాల నిడివి ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేశారని ఆరోపణల్ని ఎదుర్కొంటున్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజులు మధ్య సంభాషణ జరిగింది. డబ్బులు వ్యవహారానికి సంబంధించి ఇందులో క్లియర్‌గా వుంది. రోహిత్ రెడ్డి ఒక్కడు రూ.100 నోటు అడుగుతున్నారు.మిగతా వారికి వేరే రేటు వుందని ఆడియోలో వుంది. వీళ్ల భాషలో రూ.100 నోటు అంటే వందకోట్లు.అంతే కాదు మరిన్ని సంచలన విషయాలు ఈ ఆడియోలో వున్నాయి.

నందు: పైలట్ రోహిత్ రెడ్డితో నేను మాట్లాడా.నువ్వు ముందుగా వస్తే నువ్వే టీమ్ లీడర్ అవుతావని చెప్పా.ఒక్కొక్కరికి ఒక్కో రేటు వుంటుందని చెప్పాను.
రామచంద్రభారతి: ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

నందు : రోహిత్ రెడ్డి ఒక్కరు రూ.100 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మిగతా వారి రేటు వేరు

రామచంద్రభారతి:  అయితే నేనే పైన చెప్పేటప్పుడు నలుగురిని తీసుకొస్తాడని చెప్తాను.రోహిత్ ని తీసుకుంటే మిగిలిన వారు ఆయనతో పాటు వస్తారని చెబుతాను.

నందు : ఇక్కడ వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పండి. పైలట్ రోహిత్ రెడ్డి విలువైన వ్యక్తి అని పైన చెప్పండి

రామచంద్రభారతి : మనం ఎక్కడ కూర్చుంటున్నామో గుర్తుంచుకోవాలి. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. ఒక్కసారి కమిట్ అయితే మాట వెనక్కి తీసుకోలేం. బండి సంజయ్ , కిషన్ రెడ్డితో కాదు. మనం ఇంకా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం.

నందు: ఈ విషయం స్థానిక లీడర్లకు తెలియకూడదు

రామచంద్రభారతి: మనం చేసే ఆపరేషన్ తెలంగాణ లీడర్లకు తెలియకుండా చేస్తాం. మునుగోడు ఉప ఎన్నిక కన్న ముందే రూ.వంద అడిగినా పైనా మాట్లాడుతా.నన్ను పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడించండి. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారో తుషార్ కు చెప్పాలి. మునుగోడు ఎన్నిక కంటే ముందే దీన్ని కంప్లీట్ చేయాలి. వాట్సాప్ లో నన్ను వారితో కాన్ఫరెన్స్ లో పెడితే మాట్లాడుతా.

సింహయాజలు: వంద కిలోమీటర్ల రేడియస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో వున్నారు. తాండూరు, కొడంగల్ , చేవెళ్ల ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడాను.
రామచంద్రభారతి: కేవలం ఇద్దరి ముగ్గురి కోసం వారు ఢిల్లీ నుంచి రావడం సరికాదు. కనీసం ఐదుగురు లేదా ఆరుగురు జాయిన్ అయ్యేలా వుండాలి. అప్పుడే వారిని ఢిల్లీ నుంచి రప్పించాలి.

సింహయాజులు: రూ.వంద కావాలని రోహిత్ అంటున్నాడు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రభుత్వంతో ఢీ కొనడం అంతా ఈజీ కాదని రోహిత్ అంటున్నాడు.
రామచంద్రభారతి: రోహిత్ రాజీనామా చేస్తే నెలరోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది. ఢిల్లీలోనూ ఇదే టీమ్ పనిచేస్తోంది. 43మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో వున్నారు.