అమెరికాలో చదువుకోవడం మీ డ్రీమా? కానీ వీసా ఇంటర్వూలో ఫెయిల్ అయ్యారా? నో ప్రాబ్లెమ్. ఈసారి మళ్ళీ ట్రై చేయండి. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? విద్యార్ధులకోసం అమెరికా శుభవార్త చెప్పింది. ఒకసారి ఫెయిల్ అయినా మరోసారి ఇంటర్వూకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. మామూలుగా ఎప్పుడూ ఇలానే ఉండేది. ఎన్నిసార్లు అయినా ఇంటర్వేకి వెళ్ళేటట్టు. కానీ గత ఏడీదిగా మాత్రం ఒక్కసారి మాత్రమే ఇంటర్వూకి ఎటెండ్ అయ్యే అవకాశం ఉంది. కోవిడ్ కారణాలు, వీసా నిబంధనలు లాంటి ఏవేవో కారణాల. దాన్ని ఇప్పుడు మార్పులు చేసి మొత్తం వీసా ప్రక్రియ అంతా ముగిసి ఇంటర్వే దగ్గర ఫెయిల్ అయినవారికి రెండోసారి ఛాన్స్ ఇచ్చే వీలును కల్పించింది.
దీని ప్రకారం వచ్చే నెలలో వీసా ఇంటర్వూల్లో తేదీ స్లాట్లను విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశంలో ైదు కార్యాలయాల్లో అంటే ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్, చెన్నై, కోలకత్తాలలో ఈ సదుపాయాన్ని కల్పించనుంది. కచ్చితమైన డేట్లను ఇంకా ప్రకటించలేదు కానీ జనవరి మొదటివారంలో స్లాట్లను విడుదల చేసే అవకాశాలున్నాయని అమెరికా కాన్సులేట్ స్పష్టం చేసింది. స్లాట్లు ఓపెన్ చేసిన వెంటనే ఫిల్ అయిపోతున్నాయి కాబట్టి విద్యార్ధులు ఎలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తోంది.