రష్యా మరో సంచలనం.. రెండో వ్యాక్సిన్ కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా మరో సంచలనం.. రెండో వ్యాక్సిన్ కూడా..

September 23, 2020

bfbv

కరోనాకు మందు కనిపెట్టడంలో రష్యా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్పుత్నిక్ వీ పేరిట ఓ వ్యాక్సిన్‌ తీసుకువచ్చిన ఆ దేశం మరో సంచలనానికి తెరతీసింది. మరో వ్యాక్సిన్ కూడా తయారు చేస్తూ.. దాన్ని కూడా రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ‘ఎపివాక్ కరోనా’ పేరుతో మరో వ్యాక్సిన్ రూపొందిస్తోంది. అక్టోబర్ 15 నాటికి దీన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక దేశాలు ఒక్క వ్యాక్సిన్ అయినా తీసుకురావాలని ప్రయోగాలు జరుపుతుంటే రష్యా మాత్రం రెండో మందు కూడా సిద్ధం చేయడం విశేషం.

సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ సహకారంతో దీన్ని తయారు చేస్తున్నారు. మొదటి దశ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలు ఇచ్చాయని అక్కడి అధికారులు వెల్లడించారు. రెండో దశను కూడా పూర్తి చేసి వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థలో రిజిస్టర్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత మూడో దశ ట్రయల్స్ కూడా కొనసాగించనుంది. కాగా ఇప్పటికే స్పుత్నిక్ వీ మూడవ దశ ప్రయోగాల్లో పలు దేశాలు భాగస్వాములుగా మారాయి. 10 దేశాలు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కోసం మన దేశంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. వేగంగా తీసుకువస్తున్న ఈ మందు ఎంత వరకు ప్రభావం చూపుతోందో చూడాల్సి ఉంది.