రెండో విడత రైతు భరోసా సాయం ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

రెండో విడత రైతు భరోసా సాయం ప్రారంభం

October 27, 2020

ap

రెండవ విడత వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సీఎం‌ జగన్ ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్ల నగదును బదిలీ చేశారు. ఈ పథకం ద్వారా 50.07 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఈ సాయం అందుతోందని తెలిపారు. రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. వారికి రూ.11,500 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినా రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రెండవ విడత కింద వైఎస్సార్‌ రైతు భరోసాను వారి ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు.