సరిహద్దుల్లో సొరంగం.. అమర్‌నాథ్ యాత్రే లక్ష్యం! - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దుల్లో సొరంగం.. అమర్‌నాథ్ యాత్రే లక్ష్యం!

May 5, 2022

జమ్ము కాశ్మీర్‌లోని సాంబా జిల్లా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు ఓ సొరంగాన్ని కనిపెట్టాయి. అంతర్జాతీయ సరిహద్దు వద్ద అవుట్ పోస్ట్‌కు 300 మీటర్ల దూరంలో ఈ సొరంగం ఉంది. త్వరలో జరగబోయే అమర‌నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు చేయగా సొరంగం బయటపడింది. ఈ సొరంగం నుంచి భారతదేశ చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లని అధికారులు తెలిపారు. 2017లో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేయగా 8 మంది మరణించారు. కాగా, ఈ ఏడాది జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.