హ్యాపీ కపుల్స్ ఏ నది ఒడ్డునో, సముద్రం ఒడ్డునో కూర్చుని అలా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ కూర్చోరు. సినిమాల్లో చూపించినట్టు జీవితాలు అస్సలు ఉండవు. లైఫ్ అంతా పాటలు పాడుకుంటూ, ఏ ఇబ్బందులూ లేకుండా ఉంటే వాళ్ళని హ్యాపీ కపుల్స్ అనరు కూడా. భార్యభర్తా ఇద్దరికీ ఒకే రకమైన ఇష్టాలుంటాయనో, కలిసి ఎక్కువ సమయం గడుపుతారనో అనుకోవడం కూడా పొరపాటే. వాళ్ళేమీ ఆదర్శ దంపతుల్లాగా ఉండరు. వాళ్ళు కూడా అప్పుడప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు. మరి హ్యాపీ కపుల్ ని మిగిలిన వాళ్ళ నుంచి విడదీసేది ఏది అంటే… ఎమోషనల్ ఇంటలిజెన్స్. మరి ఆ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఒక లుక్కేద్దాం రండి.
ఏ ఇద్దరి మధ్య అయినా ఒక ఎటాచ్ మెంట్ ఉండాలి. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒక్కలా ఉండరు, ఒక్కలా ఆలోచించరు. ఒకే కడుపున పుట్టిన అక్కాచెల్లెళ్ళు, అన్నాదమ్మలే అలా ఉండరు. అలాంటప్పుడు భార్య భర్త ఒకేలా ఉండాలనుకోవడం చాలా అసహజం కూడా అవుతుంది. మరి ఇద్దరిని దగ్గరిగా ఉంచేది ఏంటి అంటే ఎమోషనల్ ఎటాచ్ మెంట్. అది కూడా అర్ధం పర్ధం లేకుండా , గుడ్డిగా ఉండకూడదు. దానికి ఒక ఇంటిజెన్స్ ఉంటుంది, ఉండాలి కూడా. అలా ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికీ, కలిసి కొన్ని పనులు చేయడానికీ ఇష్టం చూపుతారు. అంటే ఒకళ్ళ యస్ అనగానే ఇంకోళ్ళు వెంటనే నో అనేయరు. అనుకున్నంత మాత్రాన కుదరచ్చు, కుదరకపోవచ్చు, కానీ వెంటనే నాకు కుదరదు అని మాత్రం అనరు.
ఒకరితో ఒకరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికీ, ఎస్టాబ్లిష్ అయిన కనెక్షన్ బలపడడానికీ ట్రై చేస్తారు.
వీరిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడానికి వెనుకాడరు. అయితే ఆ విమర్శ ఎదగడానికి ఉపయోగపడేలా చేసుకుంటారు.అంటే పాజిటివ్ క్రిటిసిజం అంటాం కదా, అలాగన్న మాట. అప్పుడు వారు వ్యక్తులుగా ఎదుగుతారు, కపుల్‌గా కూడా ఎదుగుతారు.
ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉన్నవాళ్ళు గొడవలు చాలా తక్కువగా పడతారు. ఎందుకంటే వీరిద్దరూ వారి ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలరు కాబట్టి.
వీరు వీరి ఫీలింగ్స్‌ని కంట్రోల్లో పెట్టుకోగలరు. అప్పుడే వాళ్ళు కోపాన్నీ చిరాకునీ వదిలి హ్యాపీగా ఉండగలుగుతారు. వీరి సీక్రెట్ అదే.
వీరిద్దరూ ఒకరు చెబుతున్న విషయాన్ని అదే పర్స్పెక్టివ్లో అర్ధం చేసుకోగలరు. అందుకే వీరిద్దరి మధ్యా స్ట్రగుల్ తక్కువగా ఉంటుంది. తమకు ఆ దృష్టి లేకపోయినా, అవతలి వాళ్ళ ఆలోచనను బట్టి అలవాటు చేసుకోవడానికి, ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ప్రతీసారి ఇందులో సఫలం కాకపోవచ్చు. కానీ చేస్తున్న కొద్దీ అలవాటు అవుతుంది.
వేళాకోళంగా మాట్లాడడం, అమర్యాదగా మాట్లాడడం, తక్కువ చేసి చూడడం, లేదా మాటలనడం వంటి పనులు వీరసలు చేయరు. వీరిద్దరూ ముందు వ్యక్తులుగా గౌరవాన్ని ఇచ్చుకుంటారు.
వీరి బంధానికి పునాదిగా స్నేహం నిలుస్తుంది. వీరిద్దరూ ముందు ఫ్రెండ్స్, ఆ తరువాతే పార్ట్నర్స్. ఫ్రెండ్ షిప్ లో ఉండే నిజాయితీని వీరు బంధంలో కూడా కొనసాగిస్తారు.
ఒకరి ప్రజెన్స్‌ని ఒకరు కోరుకుంటారు, ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు.
వీరు ఒకరి అభివృద్ధికి ఒకరు కావాల్సిన సహాయ సహకారాలని అందిస్తారు.
చివరిగా..
ఎమోషనల్ అటాచ్ మెంట్, ఇంటలిజెన్స్ ఉన్న దంపతులు ఒకరితో ఒకరు కలిసి గడపాడానికి ప్రాధాన్యతనిచ్చినా, ఎప్పుడూ ఒకరిని ఒకరు అంటిపెట్టుకునే ఉండాలని కూడా అనుకోరు. అది సఫొకేటింగ్‌గా ఉంటుందని వీరికి తెలుసు. అందుకే ఎవరికి వారు స్వంతంగా కొంత సమయం గడపడంలో ఉండే ఆనందాన్ని కూడా వీరు ఎంజాయ్ చేస్తారు. ఏ బంధమైనా అవతలి వాళ్ళని అర్ధం చేసుకుని, తమ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉంటే బావుంటుంది.