ఢిల్లీ, మహారాష్ట్రలో 144 సెక్షన్‌, తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్! - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ, మహారాష్ట్రలో 144 సెక్షన్‌, తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్!

March 22, 2020

bn bn

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్రలో 144 సెక్షన్‌ విధించారు. ఢిల్లీలో ఈరోజు రాత్రి 9గంటల నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు ఈ నిబంధన అమలులో రానుంది. 

మహారాష్ట్రలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. మార్చి 31వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈనెల 31వరకు రాష్ట్రాలను లాక్ డౌన్ చేయాలని యోచిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను తెలియజేయనున్నారు.