గోవా టూరిస్టులకు షాక్.. ఆ ప్రాంతంలోకి నిషేదం - MicTv.in - Telugu News
mictv telugu

గోవా టూరిస్టులకు షాక్.. ఆ ప్రాంతంలోకి నిషేదం

February 15, 2020

Section 144 imposed in North Goa

ఏదైనా వెకేషన్‌ కోసం గోవా వెళ్దామని అనుకునే వారికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. టూరిస్టులు ఎవరూ వెస్టర్స్ ఘాట్ ప్రాంతంలోకి రాకూడదని హెచ్చరించింది. అక్కడ తీర ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్టు వెల్లడించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో నార్త్ గోవా జిల్లా పరిధిలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 

ఫిబ్రవరి 11వ తేదీ నుంచే సుమారు 60 రోజులు ఈ సెక్షన్ అమలులో ఉండనుంది. అంటే ఏప్రిల్ 10వ తేదీ వరకు ఉంటుందని ఇంటలిజెన్స్ చెబుతోంది. ఉగ్ర కదలికల అనుమానంతో తీర ప్రాంతాల్లో గస్తీ పెంచారు. దీంతో పాటు అనుమానితులపై నిఘా పెట్టారు.  ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. సరైన గుర్తింపు కార్డులు లేని వారికి గదులు కేటాయించొద్దని కూడా ఆదేశాలు జారీచేశారు.