భారతఆర్మీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులకు సికింద్రాబాద్ ఆర్మీ నియామక బోర్డు శుభవార్త తెలిపింది. అగ్నివీరుల నియామకానికి సంబంధించి అర్హత పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 16 నుంచి మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సికింద్రాబాద్ ఆర్మీ నియామక అధికారి తెలిపారు. ఈ ఎంపిన రెండుదశల్లో ఉంటుందని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. ర్యాలీలో అర్హత సాధించిన అభ్యర్థులను అగ్నివీరులుగా సెలక్ట్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా ఆర్మీలో చేరేందుకు ఉత్సాహవంతులైన యువకులు www.joinindiarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగానే అగ్రివీరుల సెలక్షన్ ఉంటుందని అధికారులు తెలిపారు.
మూడు దశల్లో ఎంపిక:
అగ్రివీర్ లో మొత్తం మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో కేటాయించిన సెంటర్లలో అభ్యర్థులందరికీ ఆన్ లైన్లో కామన్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. రెండు దశలో శారీరక ద్రుఢత్వ పరీక్షలు. మూడో దశలో వైద్య పరీక్షలు ఉంటాయి. సీఈఈ నిర్వహణ వల్ల రిక్రూట్ మెంట్ భారీ రద్దీని తగ్గించేందుకు వీలుంటుంది.